xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలుచేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలు
ఆంధ్రప్రదేశ్

గాంధీజీ ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం

01-10-2026 16:34
గాంధీజీ ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం
జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
xPress24, Paravathipuram, October 1, పార్వతీపురం మన్యం, అక్టోబర్ 1: జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక సందేశాన్ని విడుదల చేశారు. అహింసా మార్గంలో పోరాటం చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, సమానత్వం, స్వచ్ఛత వంటి ఆదర్శాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. గాంధీజీ కన్న కలల సాకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ బాటలో పయనిస్తూ, ఆయన ఆశయాలను నిత్య జీవితంలో ఆచరించి జిల్లా అభివృద్ధి, ప్రగతిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.