ఆంధ్రప్రదేశ్
గిరిజన సంక్షేమంపై సమీక్ష
30-09-2026 14:16

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురంమన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్ధిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
xPress24, Seethampeta, September 30,