xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు

06-10-2026 16:00
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు మార్కాపురం జిల్లాలో రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 13 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మంగళవారం ప్రారంభించారు.
xPress24, Ongole, October 6, మార్కాపురం: గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు మార్కాపురం జిల్లాలో రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 13 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 265 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా సాధారణ వ్యాధులకు వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మందుల పంపిణీ, ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ క్లినిక్‌లు ఉపయోగపడతాయన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువ కావడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

🎥 వీడియో

గ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.