తెలంగాణ
గోవా సీఎం, బీజేపీపై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
12-10-2026 15:49

గోవాలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, సీఎం ప్రమోద్ సావంత్ కాకుండా ఆయన 'ప్రాపర్టీ సావంత్' అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గోవా పర్యటనలో భాగంగా 'గోయ్ రాఖోన్న్' యాత్రలో ఆయన మాట్లాడారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పేరుతో పేదలు, SCలు, మైనారిటీల ఓట్లను ప్రధాని మోదీ తొలగిస్తున్నారని మండిపడ్డారు. గోవాను డ్రగ్స్ పెడ్లర్ల అడ్డాగా మార్చారని ఆరోపించారు. భాజపాను నమ్మి మరోసారి మోసపోవద్దని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు.
xPress24, HYDERABAD, October 12,