ఆంధ్రప్రదేశ్
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ
13-10-2026 14:03

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
xPress24, Amaravati, October 13,
అమరావతి, అక్టోబర్ 13:
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు.
ఈ సమావేశంలో చెన్నైకి కృష్ణా జలాల సరఫరా, గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానం తదితర అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన చెన్నైకి తిరిగి వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.