ఆంధ్రప్రదేశ్
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
06-10-2026 14:25

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.
xPress24, Undavali, October 6,
అమరావతి:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశం సుమారు రెండు గంటలపాటు కొనసాగింది. ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు.
సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అలాగే టీడీపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని యోచించినట్లు తెలిసింది. బలమున్న ప్రాంతాల్లో మిత్రపక్షాలు పోటీ చేసేలా పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.