xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్

చిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం

25-09-2026 17:56
చిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
ఒక చిన్న కార్యక్రమం ద్వారా పిల్లల ఆరోగ్యానికి ఎంతో పెద్ద ప్రయోజనం చేకూరుతుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు.
xPress24, Ongole, September 25, ఒంగోలు, సెప్టెంబర్ 25: ఒక చిన్న కార్యక్రమం ద్వారా పిల్లల ఆరోగ్యానికి ఎంతో పెద్ద ప్రయోజనం చేకూరుతుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలులోని పి.వి.ఆర్. బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో సుమారు 3 లక్షల 35 వేల మంది పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర కార్యక్రమ పరిశీలకులు జి. రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యం, ఆనందమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో నులిపురుగుల సమస్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.