xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
జాతీయం

చెన్నైలో రూ.13 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ

12-10-2026 10:31
చెన్నైలో రూ.13 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై మెట్రో రైల్ ఫేజ్-II మార్గంతో పాటు రూ. 13,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కూడా పాల్గొన్నారు.
xPress24, Hyderabad, October 12, తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-II లోని పూనమల్లి-వడపళని మార్గాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని పోరూర్ బైపాస్ నుంచి పూనమల్లి బైపాస్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కూడా పాల్గొన్నారు. దీనితో పాటు రాష్ట్రంలో రవాణా, రహదారి రంగాలను మరింత పటిష్టం చేసేందుకు రూ. 3,700 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు. అలాగే రూ. 750 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన రైల్వే మౌలిక వసతులు, చెన్నై, వీఓ చిదంబరనార్ పోర్టుల ఆధ్వనీకరణ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్‌లో అత్యాధునిక సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్‌ను జాతికి అంకితం చేయడంతో పాటు, మానవ మెదడును త్రిమితీయ అట్లాస్‌లుగా మ్యాపింగ్ చేసే ప్రతిష్టాత్మక శాస్త్రీయ మిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభ నుంచి రూ. 13,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, చెన్నైలో చేపట్టిన ఈ బహుళ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మరింత పెంచుతాయని అన్నారు. తమిళనాడుతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పటికీ అభివృద్ధి, సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వ స్పష్టమైన సంకల్పం మారలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ భాగస్వామ్యంతో తమిళనాడు అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన వెల్లడించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.