xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
ఆంధ్రప్రదేశ్

చినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’

03-10-2026 17:05
చినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’
మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, వాటికి సంబంధించిన నేరాలను అరికట్టే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
xPress24, Paravathipuram, October 3, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 3: మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, వాటికి సంబంధించిన నేరాలను అరికట్టే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్‌.వి. మాధవ్‌రెడ్డి ఆదేశాల మేరకు చినమేరంగి, తాళ్లడుమ్మ గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చినమేరంగి సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో చినమేరంగి ఎస్‌ఐ ఏ. నీలకంఠరావు, జియ్యమ్మవలస ఎస్‌ఐ ప్రశాంత్, గరుగుబిల్లి ఎస్‌ఐ పకృద్ధిన్, ఈగల్ టీమ్ ఎస్‌ఐ భాస్కరరావు, పీసీ సురేష్‌కుమార్‌తో పాటు సర్కిల్ సిబ్బంది గుర్తించిన హాట్‌స్పాట్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు, ఇతర అనుమానాస్పద ప్రదేశాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానం కలిగిన ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి, వాటికి సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక ప్రజలతో కలిసి ‘ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ’ నిర్వహించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.