xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలుమహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు
ఆంధ్రప్రదేశ్

చిరుధాన్యాలతో ఆహార చరిత్రను ఆవిష్కరించిన చిత్రకారుడు

16-10-2026 15:49
చిరుధాన్యాలతో ఆహార చరిత్రను ఆవిష్కరించిన చిత్రకారుడు
సమాజ హితం కోసం కళను వినియోగించడం అభినందనీయమని సౌత్ కోస్ట్ రైల్వే డీఆర్‌ఎం లలిత్ బోరా అన్నారు.
xPress24, Visakhapatanam, October 16, విశాఖపట్నం: సమాజ హితం కోసం కళను వినియోగించడం అభినందనీయమని సౌత్ కోస్ట్ రైల్వే డీఆర్‌ఎం లలిత్ బోరా అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ వద్ద రైల్వే ఉద్యోగి, మిల్లెట్ చిత్రకారుడు మేకా విజయ్ కుమార్ రూపొందించిన చిత్రకళా ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం చిరుధాన్యాలతో రూపొందించిన చిత్రాలను ఆసక్తిగా తిలకించి, వాటి ప్రాధాన్యం, నేపథ్యాన్ని చిత్రకారుడిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లలిత్ బోరా మాట్లాడుతూ.. మన ఆహార వారసత్వాన్ని తెలుసుకోవడం, సంరక్షించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేలా రైల్వే ఉద్యోగి, చిత్రకారుడు మేకా విజయ్ కుమార్ చేస్తున్న కృషిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. చిరుధాన్యాలతో 16 కళాకృతులు చిత్రకారుడు మేకా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మానవ ఆహార ప్రస్థానాన్ని వివరిస్తూ వివిధ రకాల చిరుధాన్యాలను ఉపయోగించి 16 కళాకృతులను రూపొందించినట్లు తెలిపారు. సుమారు ఆరు నెలల పాటు శ్రమించి ఈ చిత్రాలను తీర్చిదిద్దానని చెప్పారు. మూడు రోజుల పాటు ప్రదర్శన కొనసాగుతుందని, ప్రజలు సందర్శించి చిత్రాలను వీక్షించాలని కోరారు. ప్రకృతి, అడవులతో మానవుడికి ఉన్న తొలి అనుబంధం నుంచి వ్యవసాయం, సంప్రదాయ ఆహార వ్యవస్థలు, ఆధునిక ప్యాకేజ్డ్ ఆహారాలు, ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, ఆరోగ్య సమస్యల వరకు వివిధ అంశాలను ఈ చిత్రాల్లో పొందుపరిచినట్లు వివరించారు. కాలక్రమేణా మన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, విస్మరించిన సంప్రదాయ ఆహార పద్ధతులు, వాటి ప్రభావంగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను చిత్రాల ద్వారా వివరించినట్లు పేర్కొన్నారు. ఆహారం, వ్యవసాయం, సంస్కృతి, ఆరోగ్యం, జీవనశైలి, పర్యావరణ సుస్థిరత వంటి అంశాలను అనుసంధానిస్తూ ఈ 16 కళాకృతులను రూపొందించినట్లు తెలిపారు. పిల్లలు, విద్యార్థులు, కుటుంబాలు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలకు మానవ ఆహార ప్రస్థానాన్ని సులభంగా అర్థమయ్యేలా చేయడమే ప్రదర్శన ప్రధాన ఉద్దేశమన్నారు. ఆరోగ్యకరమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం మన ఆహార వారసత్వం నుంచి పాఠాలు నేర్చుకోవాలని, చిరుధాన్యాలకు ప్రాధాన్యమిస్తూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.