xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
తెలంగాణ

జగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం

23-09-2026 17:52
జగిత్యాల జిల్లాలో ఆయుష్ అధికారులు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి దానికి యాంటీ బయోటిక్ మందులు వాడటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని అదనపు కలెక్టర్ రాజగౌడ్ అన్నారు.
xPress24, Jagityal, September 23, జగిత్యాల జిల్లాలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఆయుష్ అధికారులు జిల్లాలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జిల్లా వైద్యాధికారిని డా. సుజాత ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ మాట్లాడుతూ.. నిత్యజీవితంలో ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. మన దేశంలో ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదం వాడుకలో ఉందని తెలిపారు. ఆధునిక యుగంలో అల్లోపతి ఎక్కువగా వాడటం వల్ల ఆయుర్వేదానికి ఆదరణ తగ్గిందని వెల్లడించారు. కానీ ప్రస్తుతం ప్రజలు కూడా ఆయుర్వేదం పట్ల మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రతి చిన్న రోగానికి యాంటీ బయోటిక్ మందులు వాడటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని జిల్లా వైద్యాధికారిని డా. సుజాత అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద మెడికల్ క్యాంపులు నిర్వహించాలని.. ప్రజలకు ఆయుర్వేదంపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆయుర్వేద మందులు వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలియజేశారు. బైట్స్ 1) రాజా గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ 2) డా. సుజాత, జిల్లా వైద్యాధికారిని 3) డా. అనిల్, ఆయుర్వేదిక్ జిల్లా నోడల్ అధికారి

🎥 వీడియో

జగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం

జగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం

జగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం

జగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.