xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు

25-09-2026 11:45
కరువు పరిస్థితులపై చర్చ.. ఈ నెల 26న విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ఆహ్వానం
xPress24, Amaravati, September 24, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీపీఐ నేతలు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఈ సమావేశం జరిగింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి. హరినాథరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. సీపీఐ నేతలకు జగన్‌ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, ఇతర ప్రజా సంబంధిత అంశాలపై ఇరుపక్షాల నేతలు చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్న రౌండ్‌టేబుల్‌ సమావేశానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సీపీఐ నేతలు ఆహ్వానించారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం అందజేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు.

🎥 వీడియో

జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.