జాతీయం
జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు
02-10-2026 15:39

జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను ఈ రోజు సందర్శించి మహాత్ముడి స్వారకం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను ప్రధాన మంత్రి గుర్తు చేసుకున్నారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఘనంగా నివాళులర్పించారు. విజయవాడలోని లోక్ భవన్ లో మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళుర్పించిన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ గాంధీజీ గొప్ప త్యాగం, ఆయన అజరామరమైన స్ఫూర్తి, ఆయన బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గాంధీజి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉపముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిలు గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులర్పంచిన వారిలో ఉన్నారు.
xPress24, Krishna District, October 2,