ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయి సరస్ మేళా
19-10-2026 09:57

గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేందుకు స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ ప్రజలను కోరారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి సరస్ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రకటనలో తెలిపారు. మేళాలో దాదాపు 600 విక్రయ శాలలు, 50 ప్రత్యక్ష ఆహార కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామీణ మహిళల నైపుణ్యాలు, సృజనాత్మకతకు ఈ మేళా జాతీయస్థాయిలో గుర్తింపు తెస్తోందన్నారు. సంప్రదాయ కళలు, చేనేత, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి మహిళల జీవనోపాధికి చేయూతనివ్వాలని కోరారు.
xPress24, Vijayawada, October 19,