ఆంధ్రప్రదేశ్
జొన్నవలస జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
07-10-2026 17:46
విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
xPress24, Vizianagaram, October 7,
విజయనగరం జిల్లా, అక్టోబర్ 7:
విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఫర్నీచర్, క్రీడా మైదానాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం నాణ్యత, అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.