xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
తెలంగాణ

జూరాల నీటి సాధనలో రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం: కేటీఆర్

23-09-2026 14:49
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల కోసం అన్నదాతలు చేసిన పోరాటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. రైతుల పోరాటంతో కుంభకర్ణ ప్రభుత్వం దిగొచ్చి నీరు విడుదల చేసిందన్నారు. రైతులకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
xPress24, Hyderabad, September 23, జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల కోసం అన్నదాతలు చేసిన పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. రైతుల నిరసనలతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి కాలువల ద్వారా నీటిని విడుదల చేయడంపై సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా స్పందించారు. "పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప!" అనే నినాదాన్ని ప్రస్తావిస్తూ, హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన రైతులకు అభినందనలు తెలిపారు. కుంభకర్ణ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించారు: కేటీఆర్ పొలాలు ఎండిపోతున్న విపత్కర పరిస్థితుల్లో కుంభకర్ణ నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని రైతులు ముల్లుగర్రతో తట్టి లేపి పరుగులు పెట్టించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుల తరఫున నిలబడి పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొంటూ క్షేత్రస్థాయిలో కలిసి నడిచిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడిగా తెచ్చిన తీవ్ర ఒత్తిడి ఫలితంగానే ప్రభుత్వం నీటి విడుదలకు సిద్ధపడిందని ఆయన పేర్కొన్నారు. హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం రాష్ట్ర ప్రజల కనీస అవసరాలు తీర్చేలా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే రాబోయే రెండేళ్ల తమ ప్రధాన కర్తవ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించడం, పోరాడడం, తెలంగాణ హక్కుల సాధన కోసం అవసరమైతే ఎవరితోనైనా రాజీలేని రీతిలో కొట్లాడటమే బీఆర్ఎస్ ముందున్న ఏకైక లక్ష్యమని తేల్చిచెప్పారు. బైట్ కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

🎥 వీడియో

జూరాల నీటి సాధనలో రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం: కేటీఆర్

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.