xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదంయాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదం
ఆంధ్రప్రదేశ్

టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం

08-10-2026 16:27
టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
xPress24, SRIKAKULAM, October 8, టెక్కలి: టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు మహిళలు, చిన్నారుల సంక్షేమం, భూగర్భ జలాల పరిరక్షణ, పరిపాలనా సౌకర్యాల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలో గురువారం పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మొత్తం రూ.3.45 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భూగర్భ జలాల పరిరక్షణతో పాటు పరిపాలనా సౌకర్యాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూముల పరిరక్షణను తన బాధ్యతగా భావిస్తున్నానని మంత్రి స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

🎥 వీడియో

టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.