తెలంగాణ
టిడ్కో ఇళ్ళు మంత్రి నారాయణ
13-10-2026 10:29

అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిడ్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడ్కో గృహాలను ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అదనంగా నాలుగు వేల 500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి తెలియజేశారు.
xPress24, Nellore, October 13,