ఆంధ్రప్రదేశ్
టీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలి
08-10-2026 17:11
బీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో టీబీ నిర్మూలనకు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.
xPress24, Puttaparthi, October 8,
పుట్టపర్తి, అక్టోబర్ 8:
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో టీబీ నిర్మూలనకు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘జోష్’ (ఆరోగ్యం కోసం సంయుక్త బృందం) జాతీయ, జిల్లా స్థాయి బృందాల ప్రారంభోత్సవం, ‘టీబీ రహిత పంచాయతీల’ సన్మాన కార్యక్రమాన్ని గురువారం పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవనంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సునీల్ కుమార్, డీటీఓ డాక్టర్ అనుపమ జేమ్స్, ఎంఓడీటీసీ డాక్టర్ జె. ప్రణయ్, టీబీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా స్థాయిలో ‘టీబీ ముక్త్ భారత్’ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, క్లాస్-1 బ్లాక్ నోడల్ అధికారుల నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన ‘జోష్’ బృందాలను రంగంలోకి దించారు. టీబీ నిర్మూలన కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, వైద్య కళాశాలల ప్రతినిధులు, టీబీ విజేతల భాగస్వామ్యాన్ని సమన్వయం చేసేందుకు డీటీఓ, జిల్లా యువజన అధికారి, స్థానిక ఎన్‌సీసీ కమాండింగ్ అధికారులకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, మేయర్లు, అవార్డులు పొందిన పంచాయతీల సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించేందుకు చర్యలు చేపట్టారు. క్లాస్-1 నోడల్ అధికారులు, ‘జోష్’ బృంద సభ్యులందరూ 100 శాతం ‘జోష్’ మొబైల్ అప్లికేషన్‌లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. అలాగే అవగాహన, శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ‘జోష్’ బృంద సభ్యులకు ఫీల్డ్ కిట్లు, గుర్తింపు కార్డులు, సమాచార, విద్య, ప్రచార సామగ్రిని అందజేశారు. ప్రధాన వేదిక వద్ద హైస్పీడ్ ఇంటర్నెట్, ఆడియో-విజువల్ సిస్టమ్స్, హైబ్రిడ్ స్ట్రీమింగ్ సదుపాయాలను ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.