ఆంధ్రప్రదేశ్
టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్
19-10-2026 21:32

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యప్పారాజుగూడెంMPTC స్థానానికి కూటమి అభ్యర్థిగా బొర్రా మెహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
xPress24, Lingapalem 19-Oct-2026
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యప్పారాజుగూడెంMPTC స్థానానికి కూటమి అభ్యర్థిగా బొర్రా మెహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు కూటమి నాయకులు, మేడికొండ ప్రసాద్ గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు సమావేశంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు బొర్రా మెహర్ ను MPTC అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి అభ్యర్థి విజయానికి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు కూటమి శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ బొర్రా మెహర్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.