తెలంగాణ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవం
08-10-2026 09:45

కృత్రిమ మేధతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ... భవిష్యత్తులో దాని వల్ల తలెత్తే సమస్యల నివారణకు ఐటీ నిపుణులు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో ఆయన బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి అందించిన డేటా ఆధారంగానే కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాలు, ఆదివాసీలకు దూరవిద్య విద్యను అందించడంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు.
xPress24, Hyderabad, October 8,