తెలంగాణ
డిగ్రీ ప్రవేశాలకు ముగిసిన దోస్త్ ప్రక్రియ
07-10-2026 11:07

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 2,13,671 మందికి ప్రవేశాలు కల్పించినట్టు ఉన్నత విద్యా మండలి తెలిపింది.
xPress24, Hyderabad, October 7,
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ విద్యాసంవత్సరం మూడు విడతల సాధారణ కౌన్సెలింగ్‌తో పాటు రెండు ప్రత్యేక విడతలు, స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశాలు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 784కాలేజీల్లో 4లక్షల 42వేల 450 సీట్లకు గాను, ఈసారి 2,13,671సీట్లు భర్తీ అయినట్లు ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు బాలకిష్టారెడ్డి వెల్లడించారు.
గతేడాదితో పోలిస్తే ఈ విడతలో 8,531 సీట్లు భర్తీ కావడం విశేషం. కోర్సుల వారీగా చూస్తే విద్యార్థులు ఎప్పటిలాగే బీకాం వైపే మొగ్గు చూపారు. అత్యధికంగా బీకాంలో 77,113 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుల్లో 370 సీట్లకు గాను 302 సీట్లు (82 శాతం) భర్తీ అయ్యాయి.