xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
జాతీయం

డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ నవ్‌ప్రీత్‌ సింగ్‌ అరెస్ట్... టర్కీ నుంచి భారత్‌కు రప్పించిన కేంద్ర ప్రభుత్వం

03-10-2026 14:13
డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ నవ్‌ప్రీత్‌ సింగ్‌ అరెస్ట్... టర్కీ నుంచి భారత్‌కు రప్పించిన కేంద్ర ప్రభుత్వం
అఫ్గానిస్థాన్‌‌ నుంచి భారత్‌కు హెరాయిన్‌, మెథాంఫెటమైన్‌ తరలిస్తున్న నార్కో ట్రాఫికింగ్‌ కింగ్‌పిన్‌ నవ్‌ప్రీత్‌ సింగ్‌ను టర్కీ నుంచి భారత్‌కు డిపోర్ట్ చేయించారు. ఈ చర్యను మోదీ ప్రభుత్వం సాధించిన చారిత్రక మైలురాయిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు.
xPress24, Delhi, October 3, డ్రగ్స్‌ అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. అఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌కు హెరాయిన్‌, మెథాంఫెటమైన్‌ తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్కో ట్రాఫికింగ్‌ కింగ్‌పిన్‌ నవ్‌ప్రీత్‌ సింగ్‌ను టర్కీ నుంచి భారత్‌కు రప్పించారు. నకిలీ గుర్తింపుతో నవాబ్‌ విర్క్‌ పేరుతో టర్కీ పౌరసత్వం పొందిన అతడిని భారత దర్యాప్తు సంస్థలు పక్కాగా గుర్తించి, తిరిగి భారత్‌కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ప్రస్తుతం అతడిని డ్రగ్స్‌ అక్రమ రవాణా, ఇతర నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ నిమిత్తం జైలుకు తరలించినట్లు చెప్పారు. ఈ చర్యను మోదీ ప్రభుత్వం సాధించిన చారిత్రక మైలురాయిగా అమిత్‌ షా అభివర్ణించారు. 2029 డిసెంబర్ నాటికి లక్ష్యం రాబోయే కాలంలో డ్రగ్స్ ఉక్కునడచి అణచివేయడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తోంది. 2029 డిసెంబర్ నాటికి దేశంలో ప్రతి నార్కో కార్టెల్‌ను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి స్పష్టం చేశారు. టర్కీ నుంచి నిందితులను భారత్‌కు తీసుకురావడంలో ఇరు దేశాల మధ్య ఉన్న 2001నాటి అప్పగింత ఒప్పందం కూడా కీలకంగా వ్యవహరించింది. గతంలోనూ పలు డ్రగ్స్‌ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితులైన మహ్మద్‌ సలీం డోలా, ప్రభ్‌దీప్‌ సింగ్‌లను టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల నుంచి భారత్‌కు విజయవంతంగా తీసుకొచ్చిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రస్తావించింది. బైట్ - అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.