తెలంగాణ
డిసెంబర్ లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026
24-09-2026 09:59
డిసెంబర్ లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 జరగనుంది. సమ్మిట్ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. సమ్మిట్ పర్యవేక్షణకు కమిటీలు ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు.
xPress24, HYDERABAD, September 24,
హైదరాబాద్ లో డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 జరగనుంది. ఈ సందర్భంగా సచివాలయంలో సమ్మిట్ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం మల్లు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజూతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు మంత్రులు కీలక సూచనలు చేశారు. సమ్మిట్ పర్యవేక్షణ, నిర్వహణ కోసం ప్రత్యేకంగా 10 కమిటీలను ఏర్పాటు చేయనున్నామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ప్రతి కమిటీకి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు.