జాతీయం
ఢిల్లీకి విమాన సర్వీసులు
25-09-2026 11:08

విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
xPress24, Vizianagaram, September 24,
విజయనగరం, 22 సెప్టెంబర్ 2026 : విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసుతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా విమాన అనుసంధానం విస్తరించడంతో ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు మరింత చేయూత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.