జాతీయం
ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
30-09-2026 14:42

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు పార్టీ అధిష్ఠానం పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రజా సమస్యలు, పెండింగ్ నిధులపై పలువురు కేంద్రమంత్రులను కలసి వినతిపత్రాలు సమర్పించే అవకాశముంది.
xPress24, HYDERABAD, September 29,