xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారంసంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
జాతీయం

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కీలక నిర్ణయాలు

30-09-2026 14:05
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కీలక నిర్ణయాలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
xPress24, Hyderabad, September 29, ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం జరిగింది. దేశ ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందంటూ పలు తీర్మానాలను ఆమోదించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ పేరుతో దేశ వ్యాప్తంగా 13 కోట్ల 30 లక్షల మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఎస్ ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, తొలగించిన ఓటర్ల పేర్లను జాబితాలో మళ్లీ చేర్చాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ ముందు నుంచీ చెబుతున్న 'ఓట్ల దొంగతనం' నిజమని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రస్తుత సీఈసీ కేంద్ర ప్రభుత్వ చేతిలో 'పావు'గా మారారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, పారదర్శకంగా పనిచేయాలని కోరారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితాల మార్పులపై పూర్తి సమాచారాన్ని బహిరంగపరచాలని, లోపాలుంటే స్వతంత్ర విచారణ జరిపించాలని ఐదు కీలక డిమాండ్లను ఖర్గే ముందుంచారు. కాంగ్రెస్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఈ నిర్ణయాలన్నీ కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయని, ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.