జాతీయం
ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్ట్
07-10-2026 10:00
ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద సుమారు తొమ్మిది గంటలకు పైగా ధర్నా చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ఇండి కూటమి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
xPress24, Hyderabad, October 6,
ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద సుమారు తొమ్మిది గంటలకు పైగా ధర్నా చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ఇండి కూటమి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం వరకు ప్రతిపక్ష ఎంపీలు నిరసన ర్యాలీగా బయలుదేరారు.
ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ప్రతిపక్ష నాయకులు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంలో బారికేడ్‌పైకి ఎక్కిన రాహుల్ గాంధీ నిరసన తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన సుమారు 300 మంది ఎంపీలు ఎన్నికల కమిషన్‌ను కలవడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన పేర్కొనగా, అనంతరం భద్రతా దళాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి.