తెలంగాణ
ణేష్ నిమజ్జనానికి 700 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
25-09-2026 15:18

ఈరోజు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హుస్సేన్‌సాగర్ పరిసరాల నుంచి వివిధ రూట్లకు నిరంతరాయంగా బస్సులు తిరుగుతాయి. 44 కీలక ప్రాంతాల్లో అధికారులు, కంట్రోలర్లను నియమించారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోటి, బషీర్‌బాగ్, ఇందిరా పార్క్, ఏఐఆర్ వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు.
xPress24, HYDERABAD, September 25,