ఆంధ్రప్రదేశ్
తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందుబాటులోకి
12-10-2026 14:24

ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులైన బియ్యం, గోధుమ పిండి, ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
xPress24, Vijayawda, October 12,
విజయవాడ, అక్టోబర్ 12:
ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులైన బియ్యం, గోధుమ పిండి, ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని భవానీపురం రైతుబజార్‌లో తక్కువ ధరకే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 151 రైతుబజార్లలో కిలో బీపీటీ సన్న రకం బియ్యాన్ని రూ.49కు అందిస్తున్నట్లు వెల్లడించారు. పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంతోపాటు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.