బిజినెస్
తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధర రూ.1,52,250
13-10-2026 14:40
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,290 తగ్గి రూ.1,52,250కి చేరగా, కిలో వెండి ధర రూ.2,881 తగ్గి రూ.2,25,885 వద్ద స్థిరపడింది.
xPress24, Hyderabad, October 13,
దేశీయ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మార్కెట్ పరిణామాలు, ముడి చమురు సరఫరాలో ఒడిదొడుకులు, రూపాయి మారకం విలువలో మార్పులతో పాటు కొనుగోళ్ల హెచ్చుతగ్గులు గోల్డ్, సిల్వర్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
హైదరాబాద్ మార్కెట్లో తాజా ధరలు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,290 తగ్గి రూ.1,52,250 వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,37,200గా నమోదైంది. ముంబయి, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు తదితర నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
రూ.2,881 తగ్గిన వెండి
బంగారంతో పాటే వెండి ధర కూడా భారీగా పతనమైంది. సోమవారం కిలో వెండి ధర రూ.2,881 తగ్గి రూ.2,25,885కు చేరింది.