ఆంధ్రప్రదేశ్
తెనాలిలో స్వర్ణాంధ్ర పార్క్ ప్రారంభం
06-10-2026 09:48

2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లో రెండు కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మూడున్నర ఎకరాల్లో అభివృద్ధి చేసిన స్వర్ణాంధ్ర పార్క్‌ను మంత్రి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు, సీనియర్ సిటిజన్లకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి తెలిపారు.
xPress24, Tenali, October 6,