xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
ఆంధ్రప్రదేశ్

తుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యం

26-09-2026 14:51
తుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యం
తుఫాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
xPress24, Amaravati, September 26, అమరావతి, సెప్టెంబర్ 26: తుఫాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సముద్రంలో వేటే జీవనాధారంగా ఉన్న మత్స్యకారులు ప్రతికూల వాతావరణం కారణంగా ఉపాధికి దూరమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆయా కుటుంబాల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి ఉచిత బియ్యం అందించాలని నిర్ణయించారని తెలిపారు. ఆపద సమయంలో బాధితులకు సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. బియ్యం పంపిణీకి సంబంధించి జిల్లాల యంత్రాంగానికి అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లోని అర్హులైన మత్స్యకార కుటుంబాలన్నింటికీ ఈ సహాయం అందుతుందని స్పష్టం చేశారు. వేట నిలిచిపోయిన సమయంలో వారి కుటుంబాల ఆహార అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. అధికారులు జారీ చేసే వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మత్స్యకారుల ప్రాణ రక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతికూల పరిస్థితుల్లో వారి కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.