జాతీయం
తూర్పు భారత్‌ను అల్యూమినియం తయారీ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: కిషన్‌రెడ్డి
30-09-2026 14:48

భారతదేశ తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. కోల్‌కతాలో నిర్వహించిన ‘అల్యూమినియం రోడ్‌షో’లో ఆయన మాట్లాడుతూ.. ఒడిశా మైనింగ్ సామర్థ్యాన్ని, బెంగాల్ పారిశ్రామిక శక్తితో అనుసంధానించి బలమైన అల్యూమినియం వ్యాల్యూ చైన్ నిర్మిస్తామన్నారు. 'అల్యూమినియం విజన్ 2047' ద్వారా దేశ అల్యూమినియం ఉత్పత్తిని ఆరు రెట్లు పెంచి, అంతర్జాతీయ మార్కెట్ వాటాను 10 శాతానికి చేర్చడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశీయంగానే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి 'ఆత్మనిర్భర భారత్' సాధిస్తామన్నారు. ఇదే సమయంలో దేశంలో బొగ్గు కొరత ఏమీ లేదని, ఉత్పత్తి మరియు సరఫరా వేగవంతంగా సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, September 29,