ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్ విరిగిపడి ముగ్గురు మృతి
30-09-2026 14:11

తిరుపతి నగరంలోని డీబీఆర్ రోడ్డులో శ్రీ కన్వెన్షన్ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ ఒక్కసారిగా విరిగి కిందపడటంతో ముగ్గురు మృతి చెందారు.
xPress24, Tirupati, September 29,
తిరుపతి, సెప్టెంబర్ 29:
తిరుపతి నగరంలోని డీబీఆర్ రోడ్డులో శ్రీ కన్వెన్షన్ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ ఒక్కసారిగా విరిగి కిందపడటంతో ముగ్గురు మృతి చెందారు. శ్రీ కన్వెన్షన్ పక్కన హోటల్ నిర్మాణం కోసం సుమారు 30 అడుగుల లోతులో పునాదులు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్రేన్ కింద ముగ్గురు కార్మికులు చిక్కుకుని మృతి చెందారు.
మృతులను ఒడిశా రాష్ట్రానికి చెందిన రామారావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సివిల్ ఇంజనీర్ సందీప్, తిరుపతికి చెందిన గార్డెన్ వర్కర్ చెంగయ్యగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కమిషనర్ జయకృష్ణ మీడియాకు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.