ఆంధ్రప్రదేశ్
తిరుమలలో వైభవంగా శ్రీవారి చిన్న శేష వాహనసేవ
13-10-2026 14:00
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం మలయప్పస్వామి చిన్న శేష వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.
xPress24, Titupati, October 13,
తిరుమల:
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం మలయప్పస్వామి చిన్న శేష వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఐదు తలల శేష వాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ చిన్న శేష వాహనసేవ అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
మంగళవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.