తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు రెండు కరువు భత్యాలను మంజూరు
02-10-2026 09:45

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు రెండు కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాదు సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2 వేల 500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 శాతం వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు.
xPress24, Hyderabad, October 2,