జాతీయం
తెలంగాణకు జాతీయ స్థాయి అవార్డులు
13-10-2026 10:29

ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన అమలులో ఉత్తమ పనితీరుకు తెలంగాణలోని నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ అవార్డులను సోమవారం ప్రదానం చేశారు. రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల కల్పనలో నారాయణపేట జిల్లా, పరిపాలన, సేవల అందించడంలో నాగర్‌కర్నూల్ జిల్లా తొలి బహుమతులు సాధించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రియాంక, హేమంత్ కేశవ్ పాటిల్ అవార్డులను అందుకున్నారు. ఈ పథకం కింద ఎంపికైన వంద జిల్లాలు వ్యవసాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం సంతోషకరమని, ప్రణాళికల అమలులో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి సూచించారు.
xPress24, New Delhi, October 13,