తెలంగాణ
తెలంగాణలో ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సమరం
30-09-2026 14:06
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలయ్యింది. ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో మూడొంతుల జనాభా ఉన్న ప్రాంతంలో గ్రాడ్యుయేట్స్ తీర్పు ఇచ్చే ఎన్నికలకు ప్రక్రియ షూరు చేశారు. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై వనపర్తి జిల్లాలో ఓటరు జాబితా నోటిఫికేషన్ ను కలెక్టర్ విడుదల చేశారు.
xPress24, WANAPARTHY-509103, September 30,
వనపర్తిలో ఎమ్మెల్సీ ఎన్నికపై అధికారులతో కలెక్టర్ ఆదర్శ్ సురభి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొత్తగా ఓటర్ జాబితా రూపొందిస్తామన్నారు. ఇప్పటికే ఓటరుగా నమోదు అయినా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫారం 18 ద్వారా ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పట్టభద్రులకు సూచించారు. నవంబర్ 1, 2026 కంటే మూడు సంవత్సరాల ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తు గడువు నవంబర్ 6 వరకు ఉంటుందని తెలిపారు. దరఖాస్తుదారుల ఇంటికే అధికారులు వచ్చి ఫిజికల్ గా పరిశీలిస్తారని, అడ్రస్ ప్రూఫ్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ చూపించాలిసి ఉంటుందన్నారు. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ జాబితా... డిసెంబర్ 31న తుది ఓటర్ జాబితా విడుదల చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.
బైట్ - ఆదర్శ్ సురభి, జిల్లా కలెక్టర్, వనపర్తి జిల్లా