xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావుమోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావు
తెలంగాణ

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారు.. అక్టోబర్ 4న మెదక్ జిల్లాలో భూమిపూజ, బహిరంగ సభ

02-10-2026 09:40
తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారు.. అక్టోబర్ 4న మెదక్ జిల్లాలో భూమిపూజ, బహిరంగ సభ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ మిల్క్ బల్క్ యూనిట్‌కు ఆయన భూమిపూజ చేయనున్నారు. అనంతరం జరిగే రైతు బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
xPress24, delhi, October 1, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ ఖరారైంది.  అక్టోబర్ 3న రాత్రి  అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 9:10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హైదరాబాద్‌‌లోని హోటల్ కాకతీయలో బస చేస్తారు.   అక్టోబర్ 4 ఉదయం  మెదక్ జిల్లాలో పర్యటిస్తారు. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లికి చేరుకుంటారు.  సుమారు 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో అమూల్ సంస్థ ఏర్పాటు చేయనున్న నూతన మిల్క్ బల్క్ యూనిట్ నిర్మాణానికి అమిత్ షా భూమిపూజ చేస్తారు.   అనంతరం అక్కడ నిర్వహించనున్న భారీ రైతు బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ ఏర్పాట్లను స్థానిక అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. తూప్రాన్ కార్యక్రమం ముగిసిన తర్వాత అమిత్ షా కరీంనగర్‌లోని నాగునూరులో ఉన్న ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు.   కరీంనగర్ కార్యక్రమం అనంతరం హెలికాప్టర్‌లో తిరిగి బేగంపేటకు చేరుకుని, సాయంత్రం 5:15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.