తెలంగాణ
తెలంగాణలో టెక్స్టైల్స్ రంగం అభివృద్ధికి ఒప్పందాలు
15-10-2026 09:55

తెలంగాణలో చేనేత, జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన సంస్థలతో రెండు కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్తో తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందాల ద్వారా టెక్నికల్ టెక్స్టైల్స్ రంగంలో పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహం అందించడంతో పాటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
xPress24, Hyderabad, October 15,