xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
తెలంగాణ

తెలంగాణలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు.. ఖమ్మంలో అత్యధికంగా 36.4 డిగ్రీలు

12-10-2026 14:13
తెలంగాణలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు.. ఖమ్మంలో అత్యధికంగా 36.4 డిగ్రీలు
తెలంగాణలో వర్షాలు తగ్గి పొడి వాతావరణం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఖమ్మంలో అత్యధికంగా 36.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 36.3 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్‌లోని బేగంపేటలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34.7 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి వేళల్లో మాత్రం మెదక్, హకీంపేట్ పరిసరాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయి.
xPress24, Hyderabad, October 12, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పూర్తిగా తగ్గిపోయి పొడి వాతావరణం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న ఖమ్మంలో అత్యధికంగా 36.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు కాగా, ఆదిలాబాద్‌లో 36.3 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 36.0 డిగ్రీలు నమోదైంది. అత్యల్పంగా మెదక్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 18.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. హైదరాబాద్ నగరంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు హైదరాబాద్ నగరంలోనూ పగటి వేళ వేడి వాతావరణం కనిపించింది. బేగంపేట విమానాశ్రయం పరిధిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, ఇది సాధారణం కంటే 2.9 డిగ్రీలు ఎక్కువ. హయత్‌నగర్ క్రిడా (CRIDA) వద్ద సాధారణం కంటే ఏకంగా 4.5 డిగ్రీలు పెరిగి 34.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద కనిష్ఠ ఉష్ణోగ్రత 18.5 డిగ్రీలు, పటాన్‌చెరు ఇక్రిశాట్ వద్ద 18.2 డిగ్రీలుగా నమోదై రాత్రి వేళల్లో చల్లటి వాతావరణం నెలకొంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.