తెలంగాణ
తెలంగాణలో పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు
30-09-2026 14:19

తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారామ సాగర్ బహుళార్ధక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు.
xPress24, New Delhi, September 30,