ఆంధ్రప్రదేశ్
దుర్గాదేవి పూజ మండపాలకు ఉచిత విద్యుత్
09-10-2026 14:51

రాష్ట్రంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
xPress24, Amaravati, October 9,
అమరావతి, 09 అక్టోబర్ 2026 : రాష్ట్రంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పోలీసు శాఖ అనుమతితో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల చొప్పున ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దుర్గాదేవి ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున సహకారం అందించడం సంతోషంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు.