xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

06-10-2026 14:26
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానించారు.
xPress24, Amaravati, October 6, అమరావతి: శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు దేవస్థానం బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం. శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం శ్రీశైల దేవస్థానం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను ముఖ్యమంత్రికి అందజేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి దేవస్థానం చేపడుతున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.