xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్

13-10-2026 15:44
దివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ, స్వయంసమృద్ధితో కూడిన జీవనం కొనసాగించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.
xPress24, Ramapachodavaram, October 13, రంపచోడవరం, అక్టోబర్ 13: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ, స్వయంసమృద్ధితో కూడిన జీవనం కొనసాగించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం రంపచోడవరంలోని స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం సందర్భంగా, అంతర్జాతీయ బధిరుల వారోత్సవంలో భాగంగా పోలవరం జిల్లాలోని దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ జి. నారాయణ స్వామి ముఖ్య అతిథులుగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మూడు చక్రాల స్కూటీలు దివ్యాంగులకు రోజువారీ ప్రయాణాలతో పాటు విద్య, ఉపాధి తదితర అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను గుర్తించి, జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సంకేత భాష ద్వారా వినికిడి లోపం ఉన్నవారు తమ భావాలను ఇతరులకు సులభంగా తెలియజేయగలరని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని అన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.