జాతీయం
దేశ ప్రజలను ఐక్యం చేసేందుకు వచ్చిన వేడుకే గణేష్ ఉత్సవాలు: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
25-09-2026 11:45
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో గణేషు శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలో సుమారు రెండువేలకు పైగా వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించగా సుమారు రెండు వందలకు పైగా పెద్ద విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు.
xPress24, Yadadri Bhongir, September 24,
దేశ ప్రజలను ఐక్యం చేసేందుకు స్వాతంత్య్రోద్యమ సమయంలో వచ్చిన పండుగే గణేష్ ఉత్సవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు అదే ఆనవాయితీ కొనసాగుతోందని ఎమ్మెల్యే చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో గణేషు శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలో సుమారు రెండువేలకు పైగా వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించగా సుమారు రెండు వందలకు పైగా పెద్ద విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు. భువనగిరి చెరువులో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. మూడు అతిపెద్ద క్రేన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెరువు చుట్టూ బార్కెట్లను ఏర్పాటు చేయడంతో పాటు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది గజఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వినాయకుల శోభాయాత్రను భువనగిరి పట్టణ పురవీధుల గుండా వాహనాలలో తరలిస్తూ భక్తులు కోలాటాలు నృత్యాలు చేస్తూ ఆపాల గోపాలం నుండి పెద్దల వరకు నృత్యాలు చేస్తూ భువనగిరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపంలో వినాయకుల శోభాయాత్రలో పాల్గొన్న వారికి సన్మానాలు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శాస్త్రీయ సంగీత కచేరి, నృత్యాలు నిర్వహిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వినాయకుల మండపాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర నిర్వహిస్తున్న వినాయకుల మండప నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమయంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం దేశ ప్రజల ఐక్యతను చేయడానికి కులమతాలకు అతీతంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. అలా మొదలైన గణేష్ ఉత్సవాలు ఇప్పటికి కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. భువనగిరి ప్రజలు సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆయన ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి, వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
బైట్: కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే