xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావుమోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావు
బిజినెస్

దేశీయ స్టాక్‌ మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు నష్టాలు

02-10-2026 09:38
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఎఫ్‌ఐఐల విక్రయాలు, అమెరికాలో బాండ్‌ రాబడులు పెరగడం, చమురు ధరల పెరుగుదల మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ఒక దశలో 1200 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌‌, ఆఖర్లో కొంత కోలుకుని 570 పాయింట్ల నష్టంతో ముగిసింది.
xPress24, MUMBAI, October 1, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్ల (FII) విక్రయాలు, అమెరికాలో బాండ్‌ రాబడులు పెరగడం, అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగబాకడం వంటి పరిణామాలు మార్కెట్లను కుంగదీశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఒక దశలో ఏకంగా 1200 పాయింట్ల మేర పతనమైంది. అయితే, ఆఖర్లో కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో దాదాపు 600 పాయింట్లు కోలుకోగలిగింది. చివరకు సెన్సెక్స్‌ 570.59 పాయింట్లు కోల్పోయి 71,909.70 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 198.50 పాయింట్లు తగ్గి 22,421.95 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ దాదాపు 37 పైసలు క్షీణించి 96.31 వద్ద ఉంది. రంగాలవారీగా ప్రభావం సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ షేర్లు ప్రధానంగా నష్టపోగా.. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల బాటలో పయనించాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్ ధర 100 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 4,162 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పతనానికి ప్రధాన కారణాలు విదేశీ మదుపర్ల వెనుకంజ: దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.10,148 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఎఫ్‌ఐఐలు విక్రయించగా, ఈ వారంలోనే దాదాపు రూ.26 వేల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. అమెరికా బాండ్‌ రాబడుల పెరుగుదల: అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్లపై రాబడులు 5.33 శాతానికి (2007 తర్వాత గరిష్ఠం) చేరగా, 30 ఏళ్ల బాండ్లు 5.65 శాతానికి చేరడం మార్కెట్‌ను కలవరపెట్టింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు: ఇరాన్‌‌పై మరోసారి దాడి చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేయడం, క్రూడాయిల్ ధరలకు రెక్కలు రావడంతో మదుపర్లు ఆందోళన చెందారు.

🎥 వీడియో

దేశీయ స్టాక్‌ మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు నష్టాలు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.