ఆంధ్రప్రదేశ్
దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్నాం: మంత్రి నారాయణ
01-10-2026 16:35
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో పెన్షన్లు అందిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
xPress24, Nellore, October 1,
నెల్లూరు జిల్లా:
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో పెన్షన్లు అందిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పెన్నానది పొర్లు కట్ట ప్రాంతంలో గురువారం ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచి, ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు అందిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.