xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్

దసరా ఉత్సవాలు

13-10-2026 10:44
దసరా  ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవి సమస్త జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా, అన్నదానానికి ప్రతీకగా పూజలందుకుంటారు. అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు లోటు ఉండదని, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. మరోవైపు శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో గత రాత్రి దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ రోజు నాన బియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు.
xPress24, Vijayawada, October 13, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవి సమస్త జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా, అన్నదానానికి ప్రతీకగా పూజలందుకుంటారు. అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు లోటు ఉండదని, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. మరోవైపు శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో  గత రాత్రి దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో  బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ రోజు నాన బియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.